పల్లవి
D A D
నడిపించు నా నావ - నడి సంద్రమున దేవా
Bm G A D
నవ జీవన మార్గమున - నా జన్మ తరియింప ||నడిపించు||
చరనం 1
D Bm A G
నా జీవిత తీరమున - నా అపజయ భారమున
A G D Bm A D
నలిగిన నా హృదయమును - నడిపించుము లోతునకు
D A D
నాయాత్మ విరబూయ - నా దీక్ష ఫలియింప
Bm G A D
నా నావలో కాలిడుము - నా సేవ జేకొనుము ||నడిపించు||
చరనం 2
రాత్రంతయు శ్రమపడినా - రాలేదు ప్రభూ జయము
రహదారులు వెదకినను - రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో
రతనాలను వెదకుటలో - రాజిల్లు నా పడవ ||నడిపించు||
చరనం 3
ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే - అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే - ఆవేద నెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని - అల్లాడె నా వలలు ||నడిపించు||
చరనం 4
ప్రభు మార్గము విడచితిని - ప్రార్ధించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని - పరమార్ధము మరచితిని
ప్రపంచ నటనలలో - ప్రావీణ్యమును పొంది
ఫలహీనుడనై యిపుడు - పాటింతు నీ మాట ||నడిపించు||
చరనం 5
ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకతింతును లోకములో - పరిశుధ్ధుని ప్రేమకథ
పరమాత్మ ప్రోక్షణలో - పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు - పానార్పణము జేతు ||నడిపించు||
Chorus
D A D
Nadipinchu Naa Naava - Nadi Sandhramuna Deva
Bm G A D
Nava Jeevana Margamuna - Naa Janma Thariyimpa ||Nadipinchu||
Verse 1
D Bm A G
Naa Jeevitha Theeramuna - Naa Apajaya Bharamuna
A G D Bm A D
Naligina Naa Hrudayamunu - Nadipinchumu Lothunaku
D A D
Naa Aathma Virabhuya - Naa Deeksha Phaliyimpa
Bm G A D
Naa Naavalo Kaalidumu - Naa Seva Jekonumu ||Nadipinchu||
Verse 2
Rathranthayu Shramapadina - Raaledu Prabhu Jayamu
Rahadarulu Vedhakinanu - Radayenu Pratiphalamu
Rakshinchu Nee Siluva - Ramaneeya Lothulalo
Ratanalanu Vedhukutalo - Rajillu Naa Padava ||Nadipinchu||
Verse 3
Aathmarpana Cheyakaye - Aashinchiti Nee Chelimi
Ahamunu Preminchuchune - Arasithi Prabhu Neekalimi
Aasha Nirashaye - Aavedha Nedhuraye
Aadhyathmika Lemigani - Allade Naa Valalu ||Nadipinchu||
Verse 4
Prabhu Maargamu Vidachithini - Prardhinchuta Maanithini
Parbhu Vaakyamu Vadhalithini - Paramardhamu Marachithini
Prapancha Natanalalo - Praveenyamunu Pondhi
Phala Heenudanai Ipudu - Paatinthu Nee Maata ||Nadipinchu||
Verse 5
Prabhu Yesu Shishyudanai - Prabhu Premalo Paadhukoni
Prakatinchunu Loakamulo - Parishudhuni Premakatha
Paramaathma Prokshanalo - Paripoorna Samarpanatho
Praanambunu Prabhukoraku - Paanarpanamu Jethu ||Nadipinchu||