ఎందుకో నన్నింతగా నీవు

పల్లవి

ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవ
అందుకో నా దీన స్తుతి పాత్ర - హల్లెలూయ యేసయ్య      ||ఎందుకో||

చరనం 1 

నా పాపము బాప - నరరూపి వైనావు
నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే   (x2) ||ఎందుకో||

చరనం 2 

నీ రూపము నాలో - నిర్మించియున్నావు
నీ పోలికలోనే - నివసించమన్నావు
నీవు నన్ను ఎన్నుకుంటివి - నీ కొరకై నీ కృపలో    (x2) ||ఎందుకో||

చరనం 3

నా మనవులు ముందే - నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే - నీ గ్రంధములో నుండే
ఏమి అధ్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతును  (x2) ||ఎందుకో||

చరనం 4

నా శ్రమలు సహించి -  నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి - నన్నాదుకున్నావు
నన్ను నీలో చేర్చుకున్నావు - నను దాచియున్నావు  (x2) ||ఎందుకో||

చరనం 5

నీ సన్నిధి నాలో - నా సర్వమును నీలో
నీ సంపద నాలో - నా సర్వస్వము నీలో
నీవు నేను ఏకమగువరకు - నను విడువనంటివి      (x2) ||ఎందుకో||

Enduko Nanninthaga Neevu

Enduko Nanninthaga Neevu - Preminchithivo Deva
Anduko Naa Deena Stuthi Paatra - Hallelujah Yesayya     ||Enduko||

Verse 1

Naa Paapamu Baapa - Nararupivainavu
Naa Shaapamu Maapa - Naligi Vreladithivi
Naaku Chaalina Devudavu Neeve - Naa Sthaanamulo Neeve(x2)
                                                        ||Enduko||
Verse 2

Nee Rupamu Naalo - Nirminchiyunnavu
Nee Polikalone - Nivasinchamannavu
Neevu Nannu Ennukuntivi - Nee Korakai Nee Krupalo (x2)  ||Enduko||

Verse 3  

Naa Manavulu Mundhe - Nee Manasulo Neravere
Naa Manugada Mundhe - Nee Grandhamulonunde
Yemi Adbhutha Prema Sankalpam - Nenemi Chellinthunu (x2)||Enduko||

Verse 4

Naa Shramalu Sahinchi - Naa Ashrayamainavu
Naa Vyadhalu Bharinchi - Nannadukunnavu
Nannu Neelo Cherchukunavu - Nanu Daachiyunavu (x2)      ||Enduko||

Verse 5

Nee Sannidhi Naalo - Naa Sarvamu Neelo
Nee Sampada Naalo - Naa Sarvasvamu Neelo
Nevu Nenu Ekamaguvaraku - Nanu Viduvanantivi  (x2)      ||Enduko||

More Lyric Tools Coming Soon!

Contact

Address:

Beside manipal hospitals, tadepalli, andhra pradesh, Pincode: 522501

Website Developer:

© by Shyam Sunder

LinkedIn Shyam SunderWhatsaap Shyam Sunder

Email:
Click Here to Send an Email