ఇదిగో దేవా నా జీవితం

పల్లవి

ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీ కంకితం
శరణం నీ చరణం - శరణం నీ చరణం (x2)             ||ఇదిగో||

చరనం 1

పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు - తగినట్లు జీవించనైతి  (x2)
అయినా నీ ప్రేమతో - నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం            ||ఇదిగో||

చరనం 2

నీ పాదముల చెంతచేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయ నేర్పు  (x2)
ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము             ||ఇదిగో||

చరనం 3

విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు  (x2)
క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా          ||ఇదిగో||

Idigo Deva Naa Jeevitham

Chorus

Idigo Deva   Naa Jeevitham - Aapadha Masthakam Nee Kankitham
Sharanam Nee Charanam - Sharanam Nee Charanam  (x2)      ||Idigo||

Verse 1

Palumarlu Vaidholaginanu - Paraloka Dharshanamu Nundi
Viluvaina Nee Dhivya Pilupuku - Thaginatlu Jeevinchanaithi  (x2)
Ayina Nee Prematho - Nannu Dhari Cherchinavu
Anduke Gaikonumo Deva - Ee Naa Shesha Jeevitham         ||Idigo||

Verse 2

Nee Paadamula Chentha Cheri - Nee Chittam Neraveruga Nerpu
Nee Hrudaya Bharambu Nosagi - Prardhinchi Panicheya Nerpu  (x2)
Aagipoka Saagipovu - Priyasuthuniga Panicheyanimmu
Prathichota Nee Saakshigaa - Prabhuva Nannundanimmu     ||Idigo||

Verse 3

Visthara Pantapolamu Nundi - Kashtinchi Panicheyanimmu
Kannetitho Vithu Manasu - Kalakaalam Marinaaku Nosagu  (x2)
Kshema Kshama Kaalamaina - Ninnu Ghanaparachu Brathukanimmaya
Nashiyinchu Aathmalan - Nee Dhari Cherchu Krupanimmaya  ||Idigo||

More Lyric Tools Coming Soon!

Contact

Address:

Beside manipal hospitals, tadepalli, andhra pradesh, Pincode: 522501

Website Developer:

© by Shyam Sunder

LinkedIn Shyam SunderWhatsaap Shyam Sunder

Email:
Click Here to Send an Email