ప్రేమ యేసుని ప్రేమ

ప్రేమ యేసుని ప్రేమ - అది ఎవ్వరు కొలువలేనిది     
నిజము దీనిని నమ్ము - ఇది భువి అందించలేనిది
ఎన్నడెన్నడు మారనిది - నా యేసుని దివ్య ప్రేమ
ఎన్నడెన్నడు వీడనిది - నా యేసుని నిత్య ప్రేమ       ||ప్రేమ||

తల్లిదండ్రుల ప్రేమ - నీడ వలె గతియించును
కన్నబిడ్డల ప్రేమ - కలలా కరిగిపోవును               ||ఎన్నడెన్నడు||

భార్యా భర్తల మధ్య - వికసించిన ప్రేమ పుష్పము
వాడిపోయి రాలును త్వరలో - మోడులా మిగిలిపోవును  ||ఎన్నడెన్నడు||

బంధుమిత్రులయందు - వెలుగుచున్న ప్రేమ దీపము
నూనె ఉన్నంత కాలమే - వెలుగునిచ్చి ఆరిపోవును    ||ఎన్నడెన్నడు||

ధరణిలోన ప్రేమలన్నియు - స్థిరము కావు తరిగిపోవును
క్రీస్తు యేసు కల్వరి ప్రేమా - కడవరకు ఆదరించును  ||ఎన్నడెన్నడు||

Prema Yesuni Prema

Prema Yesuni Prema - Adi Evvaru Koluvalenidi
Nijamu Deenini Nammu - Idi Bhuvi Andinchalenidi
Ennadennadu Maaranidi -Naa Yesuni Divya Prema
Ennadennadu Veedanidi -Naa Yesuni Nithya Prema           ||Prema||

Thallithandrula Prema - Needa Vale Gathiyinchunu
Kanna Biddala Prema - Kalalaa Karigipovunu               ||Ennadennadu||

Bhaaryaa Bharthala Madhya - Vikasinchina Prema Pushpamu
Vaadipoyi Raalunu Thvaralo - Modulaa Migilipovunu        ||Ennadennadu||

Bandhu Mithrulayandu - Veluguchunna Prema Deepamu
Noone Unnantha Kaalame - Velugunichchi Aaripovunu        ||Ennadennadu||

Dharalona Premalanniyu - Sthiramu Kaavu Tharigipovunu
Kreesthu Yesu Kalvari Premaa - Kadavaraku Aadarinchunu   ||Ennadennadu||

More Lyric Tools Coming Soon!

Contact

Address:

Beside manipal hospitals, tadepalli, andhra pradesh, Pincode: 522501

Website Developer:

© by Shyam Sunder

LinkedIn Shyam SunderWhatsaap Shyam Sunder

Email:
Click Here to Send an Email