యెహోవా నా బలమా

యెహోవా నా బలమా – యదార్థమైనది నీ మార్గం

పరిపూర్ణమైనది నీ మార్గం.

1.నా శత్రువులు నను చుట్టినను – నరకపు పాశము లరికట్టినను

వరదవలె భక్తిహీనులు పొర్లిన – వదలక నను యడబాయని దేవ
…యెహోవా…

2.నా దీపమును వెలిగించువాడు – నా చీకటినీ వెలుగుగ చేయున్

జలరాసులనుండి బలమైన చేతితొ – వెలుపల జేర్చిన బలమైన దేవ
…యెహోవా…

3.యెహోవా జీవముగల దేవా – బహుగా స్తుతులకు అర్హుడ నీవు

అన్య జనులలో ధన్యత జూపుచు – హల్లెలూయ స్తుతిగానము జేసెద …యెహోవా…


4. మేఘములపై ఆయన వచ్చును – మేఘములను తన మాటుగ జేయున్

ఉరుములు మెరుపులు మెండుగ జేసి – అపజయమిచ్చును అపవాదికిని
…యెహోవా…

Yehova Naa Balama (coming soon)

Not Available Yet Hold On! Coming Soon😊

More Lyric Tools Coming Soon!

Contact

Address:

Beside manipal hospitals, tadepalli, andhra pradesh, Pincode: 522501

Website Developer:

© by Shyam Sunder

LinkedIn Shyam SunderWhatsaap Shyam Sunder

Email:
Click Here to Send an Email